రాజోలుకు చెందిన బొక్కా బాలరాజు, ఉమాదేవి దంపతులు చీటీల పేరుతో తనను మోసం చేశారని న్యాయవాది డి. రామ్మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021లో సదరు దంపతుల వద్ద చీటీలు వేసిన బాధితుడు, గడువు ముగిసినా తన రూ. 3.50 లక్షల సొమ్మును తిరిగి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.