మలికిపురం: బీజేపీ నేతల సంబరాలు

బీహార్‌లోని 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయానికి మలికిపురం బీజేపీ మండల కమిటీ శుక్రవారం మలికిపురం కూడలిలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి ఘనంగా సంబరాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో ఈ విజయం సాధ్యమైందని జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్