మలికిపురం: డీజిల్ దొరక్క జనం అల్లాడుతున్నారు: శివకుమార్

రాష్ట్రంలో నెలకొన్న డీజిల్ కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మలికిపురంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయని, దీనివల్ల సరుకు రవాణా నిలిచిపోయి నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. చమురు సంస్థలతో సమన్వయం చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. యుద్ధ ప్రాతిపదికన ఇంధన నిల్వలను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్