మలికిపురం: 'సోనియా, రాహుల్ పై కేసు నమోదు చేయడం కుట్రపూరితం'

మలికిపురం మండలం లక్కవరానికి చెందిన పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు, సోనియా, రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసు నమోదు చేయడం కుట్రపూరితమైన చర్య అని ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, నగదు బదిలీ కాకుండానే కేసులు నమోదు చేశారని, కాంగ్రెస్ ను అపఖ్యాతి పాలు చేసేందుకే ఈ కుట్ర జరిగిందని అన్నారు. 12 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్