రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని సమస్యలు, అభివృద్ధి పనులపై సూపరింటెండెంట్, కమిటీ సభ్యులతో సమీక్షించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి నాణ్యమైన చికిత్స అందించాలని సూచించారు.