చింతలపల్లిలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రాజోలు మండలం చింతలపల్లిలో పోతుమట్ల-పిప్పళ్ళవారిమెరక-కూనవరం గ్రామాలను కలుపుతూ 2.8 కి.మీ పొడవైన, రూ. 68 లక్షల అంచనాతో నిర్మించబోయే రోడ్డుకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం పోతుమట్ల ఆంజనేయస్వామి గుడి వద్ద శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం రెండు గ్రామాల ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని, చింతలపల్లి ప్రధాన రహదారిని కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్