ఒకేరోజు ఇంటర్ లో తల్లీ, టెన్త్ లో కూతురు పాస్!

ఆలమూరు మండలం పెదపళ్లకు చెందిన సలాది కుమారి, ఆమె కుమార్తె సాత్విక ఒకేరోజు పరీక్షా ఫలితాల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పరీక్ష రాసిన కుమారి 352 మార్కులు సాధించగా, కుమార్తె సాత్విక పదో తరగతిలో 543 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. వివాహమైన కూడా భర్త ప్రసాద్ ప్రోత్సాహంతో కుమారి తన చదువును కొనసాగించారు. ఒకే ఇంట్లో ఇద్దరూ ఉత్తీర్ణత సాధించడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

సంబంధిత పోస్ట్