వీరవల్లిపాలెంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, రథోత్సవం అత్యంత వైభవంగా జరిగాయి. మండలంలోని 21 గ్రామాల్లో ఇక్కడ మాత్రమే నరసింహస్వామి ఆలయం ఉండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. పూర్వీకుల కాలం నాటి ఆచారం ప్రకారం మత్స్యకారులు స్వామివారి రథాన్ని గ్రామంలో ఊరేగించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చైర్మన్ పెదబాబు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్