రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య గురువారం రాజోలులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. సినీ, రాజకీయ రంగాలలో విశిష్ట ముద్ర వేసి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ సేవలు తరతరాలకు ఆదర్శమని అమూల్య పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.