వలసల నివారణ, ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ ఈనెల 10 నుంచి 12 వరకు జరిగే 'చలో అనంతపురం' పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మలికిపురంలో పోస్టర్ విడుదల చేసిన ఆయన, ఉపాధి హామీ పథకం పేరు మార్చి కేంద్రం గాంధీజీని అవమానిస్తోందని, రాష్ట్ర వాటా నిబంధనలతో పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కూలీల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సీపీఐ నేతలు తాతాజీ, అజేయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.