రామారావు కుటుంబాన్నిపరామర్శించిన రాజేశ్వరిదేవి

మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి మలికిపురం మండలం, గూడపల్లి పల్లిపాలెం గ్రామంలో ఇటీవల మరణించిన ఏడిద రామారావు కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్