రాజోలు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు తెలిపారు. పొన్నమండ, చింతలపల్లి, కాట్రేనిపాడు, మెరకపాలెం, కూనవరం, ములికిపల్లి గ్రామాల్లో విద్యుత్ మరమ్మతుల పనులు జరగడం వల్ల ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలని సూచించారు.