రాజోలు: ప్రముఖ సినీనటికి మాతృవియోగం

రాజోలు నియోజకవర్గం రాజోలుకు చెందిన ప్రముఖ సినీ నటి కోళ్ల హేమ తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్య కారణాలతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నటి హేమ మంగళవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుని తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తన తల్లితో నిన్న ఉదయమే మాట్లాడానని, అప్పుడు బాగానే ఉన్నారని, ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని ఆమె విలపించారు.

సంబంధిత పోస్ట్