రాజోలు: యువకుడి క్షమాపణతో సర్దుమణిగిన వివాదం

అంతర్వేది కళ్యాణోత్సవాల గజమాల యాత్రలో భాగంగా చింతలపల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. యాత్రలో పాల్గొన్న ఒక యువకుడు పాదరక్షలతో అంబేడ్కర్ విగ్రహం మెట్లు ఎక్కి, విగ్రహ ముఖభాగాన్ని రుద్ది కండువా కట్టడంతో వివాదం చెలరేగింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక సామాజిక వర్గ ప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని, యువకుడితో విగ్రహానికి పాదాభివందనం చేయించి, బహిరంగ క్షమాపణ చెప్పించడంతో వివాదం సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్