రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం రాజోలులో పర్యటించనున్నారు. రాజోలు మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మలికిపురం మండలం దిండి గ్రామంలో మంచినీటి ట్యాంకు ప్రారంభం, మామిడికుదురు మండలం డాక్టర్ భూపతి నాగేశ్వరరావు మెమోరియల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. రాజోలు మండలం మెరకపాలెంలో మంచినీటి ట్యాంకును ప్రారంభిస్తారు.