రాజోలు మండలం తాటిపాకలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజోలు టీడీపీ ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. వైజాగ్ లో జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలోకి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని, నిరుద్యోగ యువతకు అన్ని రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని ఆమె తెలియజేశారు.