రాజోలు గవర్నమెంట్ జూనియర్ కళాశాల వద్ద గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ చాలా కీలక మైనదన్నారు. ప్రతి విద్యార్థి చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రగతి వైపు పయనించాలని సూచించారు. తాను కూడా ఇదే కళాశాలలో చదివి ఉన్నత స్థానాలు అధిరోహించానని తెలిపారు.