గుంటూరులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం జనవాణి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, రాజోలు నియోజకవర్గ జనసేన సీనియర్ నేత గుండుబోగుల నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ పాల్గొని ప్రజా సమస్యలపై వినతులను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన ఎల్లప్పుడూ ముందుంటుంది అని అన్నారు.