రాజోలు పట్టణ కేంద్రం రాజోలులో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీస్ స్టేషన్ పరిధిలో దీపాటి మణిరావు (38) అత్తగారి ఇంటి అరుగుపై శవమై కనిపించాడు. అదే గ్రామానికి చెందిన మణిరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రాజోలు పోలీసులు శుక్రవారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజోలు పోలీసులు చెప్పారు.