రాజోలు: 'రైతులను దళారులు దోచుకుంటున్నారు'

దిత్వా తుఫాను ప్రభావంతో మలికిపురం మండలం లక్కవరానికి చెందిన పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు బుధవారం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 1500 ధరకు గాను దళారులు రూ. 1400 ధరకే ధాన్యం కొంటూ రైతులను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ధాన్యం గిట్టుబాటు ధరకు కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆ విధంగా లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని రుద్రరాజు గోపాలకృష్ణంరాజు కోరారు.

సంబంధిత పోస్ట్