హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీసులు బుధవారం ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ ఇంటిపల్లి రామారావును అరెస్ట్ చేశారు. సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేస్తున్నట్లు నటించి నగదుతో పరారయ్యేవాడు. తెలుగు రాష్ట్రాల్లో అతనిపై 81 కేసులున్నాయి. నారాయణగూడ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు, రూ. 2.40 లక్షల నగదును ఫ్రీజ్ చేసి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.