రాజోలు: నేడు 14 గ్రామాల్లో విద్యుత్ నిలిపివేత

రాజోలు మండలం పొన్నమండ, మామిడికుదురు మండలం మగటపల్లి విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. దీనివల్ల పొన్నమండ, చింతలపల్లి, కాట్రేనిపాడు, మెరకపాలెం, కూనవరం, ములికిపల్లి, కరవాక, మగటపల్లి, గోగన్నమఠం, ఈదరాడ, కొమరాడ, ఆదుర్రు, లూటుకుర్రు మరియు పాశర్లపూడిలంక గ్రామాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడనుంది.

సంబంధిత పోస్ట్