రాజోలు: '20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య స్పష్టం చేశారు. మంగళవారం మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ నియామకాలకు శ్రీకారం చుట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగ యువతను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆమె విమర్శించారు. పరిశ్రమల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా యువతకు ఉపాధి కల్పించి అండగా నిలుస్తామని అమూల్య పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్