రాజోలు: 'వారికి పట్టాలు అందిస్తాం' - ఎమ్మెల్యే

రాజోలు మండలం తాటిపాకలో భూముల రీ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా ఎండోమెంట్, అభ్యంతర భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రెగ్యులరైజేషన్ చేసేందుకు అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతర్వేది నరసింహ స్వామి భూముల్లో 560 ఇళ్లు ఆక్రమించి నిర్మించుకున్నారని, వారికి అనుమతులు తీసుకుని సర్వేలు చేయించి, పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్