రాజోలు: రాజముద్రతో పాసు పుస్తకాలు

రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం భూముల రీసర్వే, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా రాజోలు టీడీపీ ఇంచార్జి గొల్లపల్లి అమూల్య మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని తెలిపారు. గతంలో పట్టాదారు పుస్తకాలలో తప్పులు దొర్లాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో రీసర్వే నిర్వహించి, ప్రభుత్వ రాజముద్రతో ఫోటోలు లేకుండా ఈ పాస్ పుస్తకాలను అందిస్తున్నామని ఆమె వివరించారు.

సంబంధిత పోస్ట్