హోంగార్డు కుటుంబానికి రూ.4.06 లక్షల సాయం: ఎస్పీ తుహిన్ సిన్హా

విధి నిర్వహణలో అనారోగ్యంతో మృతి చెందిన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ హోంగార్డు పంచద వెంకటరమణ కుటుంబానికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అండగా నిలిచారు. శుక్రవారం, ఎస్పీ తన కార్యాలయంలో మృతుడి భార్య భవానికి రూ.4,06,535 నగదు చెక్కును అందజేశారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని హోంగార్డులు తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చి ఈ ఆర్థిక సహాయాన్ని సమకూర్చారు. తోటి ఉద్యోగుల చొరవ అభినందనీయమని ఎస్పీ కొనియాడారు.

సంబంధిత పోస్ట్