సఖినేటిపల్లి: 'నవయాన బుద్ధ విహార్'ను ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదివారం వీవీ మెరక సమతా నగర్‌లో నూతనంగా నిర్మించిన 'నవయాన బుద్ధ విహార్‌'ను ప్రారంభించి, అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవాళికి శాంతి, కరుణ, సమానత్వాలను అందించిన మహనీయుడు గౌతమ బుద్ధుడని కొనియాడారు. బుద్ధుడి అహింసా మార్గం, సహనం నేటి సమాజానికి దిక్సూచి వంటివని, ఆయన బోధనలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అనుసరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్