రాజోలు మండలం పొన్నమండలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చేకూరి సింగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు నియోజకవర్గ నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణలతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు.