మామిడికుదురు గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

మామిడికుదురు గ్రంథాలయంలో మంగళవారం ప్రారంభమైన వేసవి శిక్షణ తరగతులను ఎంఈఓలు శ్రీనివాసరావు, మోకా వెంకన్నబాబు ప్రారంభించారు. విద్యార్థులు సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా గ్రంథాలయాల్లోని విలువైన పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. ఈ శిక్షణ తరగతులు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ సూర్యనారాయణ, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్