అంతర్వేదిలో 'సురభి' నాటక వైభవం: అలరించిన లవకుశ ప్రదర్శన

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాయి సంతోషి నాట్య మండలి (సురభి) వారు ప్రదర్శించిన 'లవకుశ' పౌరాణిక నాటకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సురభి కళాకారుల అద్భుత నటన, పద్య పఠనం ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను నింపింది. ఈ నాటకాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్