రాజోలు మండలం చింతలపల్లిలో బుధవారం అంతర్వేది కళ్యాణోత్సవాల ఊరేగింపు సందర్భంగా ఓ యువకుడు అంబేడ్కర్ విగ్రహం వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన దళిత సంఘాలు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.