లడ్డూ ప్రసాదంపై అవాస్తవ ప్రచారం

అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై జరిగిన విషప్రచారంపై వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విమర్శలు అవాస్తవమని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఎప్పుడూ వ్యవహరించలేదని శ్రీకాంత్ పేర్కొన్నారు. స్వామివారిపై జరిగిన అపవాదు తొలగినందుకు కృతజ్ఞతగా, పార్టీ శ్రేణులతో కలిసి 200 కొబ్బరికాయలు కొట్టి, స్వామివారిపై చేసిన ప్రచారాలను అవాస్తవం అని తేల్చి చెప్పారు. రాజకీయం కోసం దేవాలయాలను వాడుకోవడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుదుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇశ్రాయేల్, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబీ, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, జడ్పీటీసీ పందిరి శ్రీహరి, మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్