రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఎస్ఏసీ వైరల్ లోడ్ పరీక్షల కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో భాగంగా పలువురి నుంచి రక్త నమూనాలను సేకరించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని ఐసీటీసీ కౌన్సిలర్ ప్రతాప్ కుమార్ తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లు సలోమి, ప్రసాద్ తదితరులు నమూనాల సేకరణను పర్యవేక్షించారు.