కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు మోసపూరిత రాజకీయాలకు నిరసనగా రాజోలు నియోజకవర్గం మామిడికుదురు సెంటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పాల్గొని చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజల విశ్వాసానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి రెండేళ్లు దాటిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచించిన కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు. ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.