ఉప్పలగుప్తంలో వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహణ

అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలంలో సంస్థాగత నిర్మాణ సమావేశం పార్టీ గౌరవ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ సారధ్యంలో గొల్లపల్లి ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యదర్శి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు, సర్పంచులు, మరియు వివిధ స్థాయిల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్