విజయవాడలో అంగన్వాడీ టీచర్లను తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం తుని ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా, ప్రజా సంఘాల నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. తమ జీతాల పెంపు డిమాండ్లను పట్టించుకోకుండా, ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.