సీఎం పర్యటనపై తునిలో ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 1న తుని నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. మంగళవారం రాత్రి తేటగుంటలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమై భద్రత, కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. చామవరం వెళ్లే మార్గంలోని విజయ గార్డెన్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుకూల స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎం పింఛన్ పంపిణీలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. పలువురు అధికారులు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్