కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో తుని రూరల్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. నేటి నుండి 7 తారీఖు వరకు జరుగుతాయని సూపర్వైజర్ రమణమ్మ తెలిపారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాలు యొక్క విశిష్టతను సూపర్వైజర్ రమణమ్మ ఈ సందర్భంగా తెలియజేశారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలిని మాత్రమే ఇవ్వాలని ఆమె తెలిపారు.