ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 1న కాకినాడ జిల్లా తుని మండలంలో పర్యటించనున్నారు. చామవరం గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వినతులు స్వీకరిస్తారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.