మత్స్యకారుల అభివృద్ధికి సీఎం వరాలు

తుని మండలం చామవరంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు శుభవార్త చెప్పారు. కాకినాడ జిల్లా మత్స్యకారులకు ఆధునిక పద్ధతుల్లో చేపల వేటపై ప్రత్యేక శిక్షణ అందిస్తామని ప్రకటించారు. అలాగే అమీనాబాద్ హార్బర్ అభివృద్ధికి రూ. 80 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్