తుని మండల సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ మండల సమావేశంలో సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్ఎస్ వెంకట్ నగరం, డి. పోలవరం, రేఖవాణిపాలెం గ్రామాల్లో ఏళ్ల తరబడి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన, పేద రైతులకు తక్షణమే సర్వే నిర్వహించి సాగు హక్కులతో పాటు పట్టాలు మంజూరు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.