తుఫాను 'మొంథా'తో నష్టపోయిన రైతులు, జీవన భృతి కోల్పోయిన మత్స్యకారులకు వైసీపీ నాయకులు అండగా నిలవాలని దాడిశెట్టి రాజా కోరారు. గురువారం తుని మండలం ఎస్. అన్నవరంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన విమర్శలు గుప్పించారు. రైతులు, మత్స్యకారులను ఆదుకోవడానికి బదులు, డిజిటల్ క్యాంపెయినింగ్ కోసం రూ. 200 కోట్లు జీవో జారీ చేయడం హాస్యాస్పదమని ఆయన అభిప్రాయపడ్డారు.