కాకినాడ జిల్లా తుని మండలం సి హెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారంగా ఉన్న కుక్క శనివారం మృతి చెందింది. ఉదయం 8 కిలోమీటర్లు ప్రయాణించిన కుక్క తిరిగి వచ్చి ఆహారం తీసుకోకపోవడంతో అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయిందని జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.