సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లిన ఆయన, వైద్యుల సూచన మేరకు గుండెకు స్టంట్ వేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా కోలుకుంటున్నానని పేర్కొన్నారు. తన ఆరోగ్యం విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అభిమానులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని యనమల కోరారు.

సంబంధిత పోస్ట్