కానిస్టేబుల్ నుంచి గ్రూప్-2 ఆఫీసర్

తుని మండలం రాజుపేట గ్రామానికి చెందిన అల్లు వీరబాబు గ్రూప్-2 ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. జోన్-2లో మెరుగైన ర్యాంకు సాధించి ట్రెజరీ సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందారు. ప్రస్తుతం రంపచోడవరంలో యాంటీ నక్సల్ స్క్వాడ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వీరబాబు తన లక్ష్యాన్ని చేరుకోవడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పేదరికాన్ని అధిగమించి సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం.

సంబంధిత పోస్ట్