కాకినాడ జిల్లా తొండంగి మండలం నర్సిపేటలో వృద్ధురాలు బెనుగు దీనమ్మ హత్య కేసులో ఆమె మనవడు గోసాల జానుకు బుధవారం పిఠాపురం పన్నెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో 2025 జూలై 12న జాను తన అమ్మమ్మను హత్య చేసినట్లు విచారణలో తేలింది. కేసును తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదుతో పాటు జరిమానా కూడా విధించింది.