కాకినాడ జిల్లా తుని పట్టణంలోని కోమాకుల వారి వీధిలో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి రూ.10 లక్షల విలువైన బంగారం, నగదును అపహరించారు. ఇంటి యజమాని లోకేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.