టీడీపీ క్యాడర్‌కు ఎమ్మెల్యే దివ్య సూచనలు

తుని మండలం చామవరం, కుమ్మరిలోవ గ్రామాల్లో టీడీపీ క్యాడర్ సమావేశాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజాభిమానం పొందాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. సీనియర్ నేత యనమల రాజేశ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్