రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై నాసా అవగాహన

కోటనందూరు మండలం కె.ఏ మల్లవరం గ్రామంలో రైతులకు నాసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం, నూతన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఘన, ద్రవ జీవామృతాలను ఖర్చు లేకుండా తయారుచేసుకుని, పంటలకు మేలు చేసే విధానాన్ని ప్రోగ్రాం మేనేజర్ శ్రీను వివరించారు. ఫీల్డ్ కోఆర్డినేటర్ స్వర్ణలత చెట్టు మొదలు శుభ్రం చేసుకుని, ఘన జీవామృతం జల్లుకొని, ద్రవ జీవామృతం పూతకు స్ప్రే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాపారపు అమ్మాజీ, మార్తి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం 2026 మార్చి 28న జరిగింది.

సంబంధిత పోస్ట్