తుని రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. 2025-26 సంవత్సరానికి అధ్యక్షుడిగా తాటికొండ నాగిరెడ్డి, కార్యదర్శిగా దుబాసి ప్రసన్నకుమార్, ట్రెజరర్ గా పెనుగొండ లక్ష్మి సూర్యనారాయణ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్య క్రమానికి రోటరీ జిల్లా గవర్నర్ కల్యాణ్ చక్రవర్తి, ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు బాధ్యతలు అప్పగించారు.